TELANGANA

తెలంగాణలో కుటుంబ పాలన అంతం

తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని, అవినీతి సీఎం కె.చంద్రశేఖర్‌రావును ఫాం హౌస్‌కే పరిమితం చేయాలని, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. ఈ ఇప్పటికే దూకుడు పెంచింది. తాజాగా ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక్కలెక్క’ అన్నట్లుగా మిషన్‌ తెలంగాణ షురూ చేసింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేరికల ప్రళయం రాబోతోందని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంటున్నారు కమలనాథులు. BJP Mission Telangana తెలంగాణపైనే ఫోకస్‌.. దక్షిణాదిన పాగా వేయాలన్న బీజేపీ లక్ష్యం దశాబ్దాలుగా నెరవేరడం లేదు. బీజేపీని ఇన్నాళ్లూ దక్షిణాది ప్రజలు ఉత్తరాది పార్టీగానే పరిగణించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణ భారత దేశంలో పాగా వేయడానికి ఇదే మంచి తరుణమని అధిష్టానం భావిస్తోంది. ఇందుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని వూహ్యకర్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమలోనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్‌ చేస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మిషన్‌ తెలంగాణను ప్రారంభించింది. చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఆపరేషన్‌ లోటస్‌.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పే పనిలో పడింది. అందుకోసం ఇప్పటి నుంచే కష్టపడుతోంది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితి ఉంది. ఒకపక్క ప్రజాక్షేత్రంలో విభిన్న కార్యక్రమాలతో ముందుకు సాగుతూనే, బీజేపీ మరోపక్క ఆపరేషన్‌ ఆకర్ష్‌ అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించే పనిలో పడింది. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు కమలనాథులు. త్వరలో బీజేపీలోకి చేరికల ప్రళయం రాబోతుందని తాజాగా ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీల నుంచి కీలక నాయకులను ఆకర్షించే పనిలో పడింది అనే అంశంపై అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో పార్టీలలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను ఇప్పటి నుండే సెట్‌ చేసే పనిలో ఉంది. దీనికోసం బలమైన నాయకులకు పార్టీలోకి ఆకర్ష అంటుంది. చేరికలు వేగవంతానికి అధిష్టానం ఆదేశం.. తెలంగాణలో బీజేపీలో చేరికలను వేగవంతం చేయాలని అధిష్టాననం ఆదేశించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ ఈమేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారరు.. బలమైన నేతలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. 80 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపిన ఆయన వారి కంటే బలమైన నేతలు ఎవరైనా వస్తామంటే, పార్టీలో చేర్చుకుందామని సూచించారు. 40 నియోజకవర్గాలలో బలమైన నాయకులు కావాలని, అటువంటి నాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి సీటు ఇచ్చే విషయంలో విశ్వాసం కల్పించాలని తెలిపారు. కానీ సీటు వారికే అన్నది మాత్రం కన్ఫామ్‌ చేయలేమని పేర్కొన్నారు. BJP Mission Telangana కాంగ్రెస్‌ నుంచే క్యూ.. బీజేపీలో అత్యదిక చేరికలు కాంగ్రెస్‌ నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని, టికెట్‌ హామీ కోసమే ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్‌ తెలిపారు. బీఆర్‌ఎఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. కేససీఆర్‌నను గద్దె దించడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందని, ఇతర పార్టీల్లోని నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరాలని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ బలహీనపడిందన్న ఈటల రాష్ట్రంలోనూ అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దెబ్బతిందన్నారు. కాంగ్రెస్‌ సీనియర్లు బీజేపీ వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెడీ సీఎం తీరు రుచించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలు, వేలాదిమంది సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వంపై మంటతో ఉన్నారని పేర్కొన్న ఈటల రాజేందర్, త్వరలో గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతుందని తెలలిపారు. దీనిపై చర్చలు కూడా జరుపుతున్నామని పేర్కొన్నారు. తాజాగా ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలతో త్వరలో బీజేపీ వివిధ పార్టీల నుంచి బలమైన నాయకులకు చేర్చుకుంటుందా? ఏ పార్టీ నాయకులకు బీజేపీ షాక్‌ ఇస్తుంది అన్న చర్చ జోరుగా జరుగుతోంది.