తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ, మరోసారి బస్సు యాత్ర (Bus Yatra) పేరుతో జనాల్లోకి వెళ్లుతోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) బస్సుయాత్రను ప్లాన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో బస్సుయాత్ర సందర్భంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించేందుకు బస్సుయాత్ర సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించేందుకు బీజేపీ కార్యాచరణ రూపొందిస్తోంది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర పూర్తయిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో బీజేపీ (BJP) టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. మూడు నెలల్లో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయని, జనవరి 20 నుంచి ప్రజా గోస కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్న తీరును ప్రజలకు వివరిస్తామన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులను కేంద్రం లూటీ చేస్తోందని టీఆర్ ఎస్ సర్పంచ్ లు వాపోతున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) ఇప్పటికే పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఐదు దశల పాదయాత్ర పూర్తయింది. ఆరో దశ కూడా చేయాలని భావించినా.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారనే సంకేతాలు రావడంతో.. బస్సుయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) ఒంటరిగా ఉంటే తెలంగాణ మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి.. మరికొందరు సీనియర్ నేతలు కూడా కలిసి మరోమారు బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.