APTELANGANA

బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట

సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్. జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర రావు జనసేన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండవ తేదీన ఆయన కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు . అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం గుంటూరు అరండల్ పేట నుండి భారీ ఎత్తున ర్యాలీతో హైదరాబాదు వెళ్ళనున్నారు. తోట చంద్రశేఖర్ అభిమానులు ఇప్పటికే తన సన్నిహితులతో తను జనసేన పార్టీ వీడనున్నట్లు చంద్రశేఖర్ సంకేతాలను ఇచ్చారు. రెండో తేదీన తనకు అందుబాటులో ఉండాలని వారిని కోరడం కూడా జరిగింది. జనసేనలో తోట చంద్రశేఖర్ ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు.

తోట చంద్రశేఖర రావు బీ ఆర్ ఎస్ పార్టీలో చేరికతో ఆంధ్రప్రదేశ్ లో మరి కొంతమంది అధికారులు ఆయనతోపాటు వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం కేసీఆర్ సమక్షంలో చేరికలు.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్ చేరటం ఖాయంగా కనిపిస్తోంది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీ చేరారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్దసారధి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. రావెల కొద్ది నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లో ఏపీలో బాధ్యతల స్వీకరణకు సిద్దమయ్యారు. వీరిద్దరితో పాటుగా మరో ముగ్గురు గతంలో జనసేనలో పని చేసిన వారు కేసీఆర్ సమక్షంలో రేపు (సోమవారం) మధ్నాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటుగా అనుచర వర్గం కూడా పార్టీలో చేరేందుకు సిద్దమైంది. ప్రధానంగా టీడీపీ – జనసేన మాజీ నేతల పైన బీఆర్ఎస్ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. రాయలసీమకు చెందిన ఒక కీలక నేత కుటుంబం కూడా కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.