తనదైన బిజినెస్ ఫార్ములాలతో, మార్కెట్ స్ట్రాటెజీస్ తో ముందుకెళ్తూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్న అల్లు అరవింద్ బాలీవుడ్లోనూ బడా సినిమాలే నిర్మించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్ని స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నా డబ్బింగ్ సినిమాల మీద ఫోకస్ ఏ మాత్రం తగ్గించలేదు. ఆ మధ్య ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన నానే వరువేన్ మూవీ డబ్బింగ్ రైట్స్ కొని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో రిలీజ్ చేశాడు. కానీ అసలెప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలీనంత తొందరగా మెరుపువేగంతో బాక్సాఫీస్ నుంచి రిటనయిందా మూవీ. ధనుష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఆ చిత్రంతో అల్లు అరవింద్ కి నష్టమే తప్ప ఒరిగిందేమీ లేదు. కానీ ఆ మూవీ రిజల్ట్ అరవింద్ స్ట్రాటెజీలని ఏ మాత్రం ఎఫెక్ట్ చేయలేకపోయింది. కొన్నాళ్ల తర్వాత కన్నడ మూవీ కాంతార బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుండడం, క్రిటిక్స్ నుంచి సూపర్ అప్రిషియేషన్స్ దక్కించుకోవడంతో వెంటనే ఆ మూవీ రైట్స్ కొని అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేశాడు. కట్ చేస్తే.. ఓ స్ట్రెయిట్ మూవీ కంటే మూడింతల లాభాల్ని గడించిందా చిత్రం. ప్రొడ్యూసర్ గా అల్లు అరవిందు కి కొన్ని కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది కాంతార.
అదే జోష్ తో వరుణ్ ధావన్ హీరోగా నటించిన భేడియా అనే హిందీ మూవీ హక్కులు కొని తెలుగులో తొడేలు పేరుతో రిలీజ్ చేశాడు. తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఒకే రోజు రిలీజైన ఆ మూవీ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అయినా అల్లు అరవింద్ డల్లవలేదు. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో కొత్త మూవీ రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్నా, కమర్షియల్ గా ఇక్కడా వర్కవుట్ అవుతుందని ఏ మాత్రం అనిపించినా వెంటనే రైట్స్ కొని తెలుగులోనూ రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 30న విడుదలైన మాలికప్పురం అనే మళయాళం మూవీ అక్కడ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఉన్ని ముకుందన్ (భాగమతి ఫేమ్) నటించిన ఈ మూవీ రూ. 2 కోట్ల బడ్జెటుతో తెరకెక్కి ఇప్పటికే దాదాపు రూ,. 40 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దాంతో ఈ మూవీకొస్తున్న రెస్పాన్స్ చూసిన అల్లు అరవింద్ తెలుగు హక్కులు కొనేశాడు. డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని జనవరి 21 న తెలుగులో విడుదల కానుందీ చిత్రం.