‘భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు. ఆయన జీవితంలో అదొక్కటే సాధించలేక పోయారు. ఆ ఒక్కటి తప్ప ఆన్నీ సాధించిన మేరునగధీరుడు ఆయన. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కాలేకపోయినప్పటికీ వి.పి. సింగ్ ను ప్రధానిగా(PM) కూర్చోబెట్టడం ద్వారా కింగ్ మేకర్ అయ్యారు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కచోటకు చేర్చి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంచలన సంస్కరణలు చేయడం ద్వారా మరువలేని సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. తన పరిపాలనాకాలంలో ఎన్నో ప్రయోగాలు చేసి సామాన్యుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయారు. రాజకీయ సేవకుడు (NTR) కోట్లాదిమంది ప్రజల నుండి పొందిన అభిమానధనానికి ప్రతిగా ఏదైనా ఇవ్వాలనుకున్నారు. సగటుమనిషి కోసం నిలవాలని నిశ్చయించుకున్నారు. ప్రతిపౌరుని ఋణం తీర్చుకోవాలని సంకల్పం చేసుకొన్నారు. తెలుగుప్రజ కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు.
తొమ్మిది నెలల్లోనే జయకేతనం ఎగురవేశారు. ఢిల్లీ(PM)పీఠాలను గజగజ వణికించారు. తెలుగుప్రజల్లో రాజకీయ చైతన్యం నింపారు. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాలను నాయకులుగా, మంత్రులుగా చేశారు. రాజకీయ యవనికలోనూ మహానాయకుడిగా నిలిచారు. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. పేదలకోసం, మహిళల కోసం అహరహం తపించారు. సంచలన విజయాలు రాజకీయ జీవితంలో సంచలనాలు, సంచలన విజయాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆన్నీ చూశారు. రాజకీయాల్లో అమేయంగా గెలిచారు. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం ఎన్ టి ఆర్ బలాలు. అహం,ఆవేశం, అతివిశ్వాసం ఆయన బలహీనతలు. మొండితనం ఆయన ఆస్తి. పట్టుదల ఆయన ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం ప్రతిక్షణం శ్రమించారు. అనంతమైన,అనితర సాధ్యమైన,అభేద్యమైన ప్రజాభిమానమే ఆయన ధనం. ఆత్మాభిమానం ఆయన ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే ఎన్.టి.రామారావును విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహిత పాలన ఆయన ముద్ర. ప్రజాధనం వృధాకాకుండా చూడడం ఆయన ప్రత్యేకం. సంస్కరణలు అనేకం (PM) పటేల్ పట్వారి వ్యవస్థ నిర్మూలనం, శాసనమండలి రద్దు, మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగుగంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో రెండురూపాయల బియ్యం పధకం, విద్యుత్ చార్జీల తగ్గింపు, కార్పొరేషన్ పదవుల సంఖ్య కుదింపు. ఇవ్వన్నీ ఎన్.టి. ఆర్ చేసిన సంస్కరణల, ప్రజాప్రయోజనాల పర్వం. ఏకపక్ష నిర్ణయాలు, ప్రజాప్రతినిధుల పాత్రను విస్మరించడం, ఒకేసారి కేబినెట్ మొత్తం రద్దు చెయ్యడం, తన మీద తనకు అతివిశ్వాసం, తను నమ్మినవారిపట్లా అదే అతివిశ్వాసంగా ఉండడం, చుట్టూ జరుగుతున్న కుట్ర, కుతంత్రాలను, తప్పులను గమనించకపోవడం మొదలైనవి. ఎన్టీఆర్ రాజకీయజీవితంలో చేదు అనుభవాలు, అపజయాలు, ఆత్మక్షోభ పొందడానికి కారణాలు అయ్యాయి. తెలుగురాష్ట్రంలోనే కాక, భారతదేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థలను నిర్మించిన ధీశాలి నందమూరి తారక రాముడు. అస్తమించిన రోజు జనవరి 18