APTELANGANA

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

 

కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల ప్రజలకు ఇళ్ళ పట్టాలు చేసి ఇచ్చిన భూమి గత ఇరవై సంవత్సరాలుగా కోర్టు కేసులో ఉన్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు లేని ప్రాంతంలో డబ్బులు పెట్టీ కొని ఇవ్వాల్సిన వారు కోర్టు వివాదంలో ఉన్న భూమి అని తెలిసి కూడా స్థానిక వైసీపీ నాయకులతో కుమ్మక్కై అధికారులు కూడా పని చేస్తున్నారని అన్నారు. చేతకాని ప్రభుత్వం పరిపాలన చేస్తే అన్ని పనులు ఇలానే అసమర్ధ్తతో అస్తవ్యస్తంగా ఉంటాయని చెప్పారు. ఈ విషయంలో భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడడమే కాకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తామని లేని పక్షంలో జనసేన పార్టీ తరపున తీవ్ర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యపడుతుందని తెలియజేశారు. జనసేన పార్టీ ద్వారా ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి పేద వాడి సొంత ఇంటి కల నిజం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.