`లిక్కర్ క్వీన్` గా ప్రత్యర్థి పార్టీల నుంచి వ్యంగ్యాస్త్రాలను వింటోన్న కల్వకుంట్ల కవిత (Delhi Liquor) అరెస్ట్ కు రంగం సిద్దమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను పేర్కొంటూ చార్జిషీట్లను సీబీఐ తయారు చేసింది. తాజాగా ఆమెకు మరోసారి సీబీఐ నోటీసులు(CBI Notice) ఇవ్వడంతో అరెస్ట్ ఖాయమని వినిపిస్తోంది. గత కొంత కాలంగా ఆలస్యంగా విచారణ జరుగుతోన్న ఈ కేసు వెనుక రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ప్రత్యర్థి పార్టీలు భావించాయి. అంతేకాదు, కవితను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆమెకు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో కవిత భవిష్యత్ పై బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు, ప్రత్యర్థి పార్టీల్లోనూ చర్చనీయాంశం అయింది. లిక్కర్ క్వీన్` కల్వకుంట్ల కవిత అరెస్ట్..? (Delhi Liquor) ఒక వైపు ఈడీ మరో వైపు సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor) ను నిగ్గు తేల్చనుంది. ఆ క్రమంలో నాలుగు రోజుల క్రితం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇటీవల కవితకు వ్యక్తిగత సహాకునిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఏపీ రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవను తాజాగా సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక ఇప్పుడు కవిత వంతు మాత్రమే మిగిలి ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఇటీవల ఆమెను సీబీఐ హైదరాబాద్ లోని ఆమె ఇంటిలో ప్రశ్నించింది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేసిన సీబీఐ ప్రధానంగా ఆమె వాడిన మొబైల్ సిమ్ కార్డుల మీద దృష్టి పెట్టింది. వాటి ద్వారా ఎవరెవరితో కవిత లాబీయింగ్ నడిపారు? అనే దానిపై ఒక నిర్థారణ కు వచ్చింది. Also Read : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో అటు ఆప్ ఇటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కార్నర్ చేస్తుందంటూ ఇటీవల ఆ పార్టీల లీడర్లు గగ్గోలు పెట్టారు. అంతేకాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రత్యర్థి పార్టీల లీడర్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలకు దిగారు. ఈడీ, బోడీ ఏమీ చేయలేవంటూ కల్వకుంట్ల కుటుంబం ఇటీవల వరకు అసెంబ్లీ లోపల, బయట హూంకరించారు. మరోసారి కవితకు సీబీఐ నోటీసులు (CBI Notice) జారీ చేయడంతో ఆ పార్టీలో అలజడి ప్రారంభం అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే రోజు ఈ నోటీసులు రావడం బీఆర్ఎస్ కు దడపుట్టిస్తున్నాయి. నోటీసులను అందుకున్న కవిత వెంటనే మండలి సమావేశాల్లో ఉన్న మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లారు. అన్నా, చెల్లెలు ఈ నోటీసుల గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది.