కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రతి ప్రయాణికుడికి ఒకసారి వందే భారత్ ఎక్కాలనే యోచనను కల్పిస్తున్నారు.
ఏపీ, తెలంగాణకు కలిపి ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు తిరుగుతోంది.
తాజాగా తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ కేటాయించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో వందే భారత్ 10 నిముషాలు ఆగింది. రాత్రి 7.15 గంటలకు ఆగిన రైతులు 7.25కు బయలుదేరి వెళ్లింది. వందే భారత్ అక్కడ ఆగిన సమయంలో ప్రయాణికులు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ప్రయాణికులకుకానీ, రైల్వే సిబ్బందికికానీ వందే భారత్ వస్తున్నట్లు ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. రైల్వే సిబ్బందే వందే భారత్ ను చూసి ఆశ్చర్యపోయారు.
పలాసలో డ్రైవర్లు, గార్డులు మారిన తర్వాత తిరిగి బయలుదేరి వెళ్లింది. ఏపీ మీదగా మరో వందేభారత్ నడవబోతోందంటున్నారు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు నడిపే యోచనలో రైల్వే శాఖ ఉంది. ట్రయల్ రన్ కింద భువనేశ్వర్ వరకు నడిపించారంటున్నారు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడకు నడుస్తుంది? తదితర వివరాలపై స్పష్టత లేదు. అయితే ట్రయల్ రన్ మాత్రం విజయవంతంగా నిర్వహించారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు నడుస్తున్న వందే భారత్ ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటోంది. అలాగే సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు వైజాగ్ చేరుకుంటోంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటోంది. అలాగే తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటోంది.