మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో నిన్న రాత్రి V6 News రిపోర్టర్, కెమెరామన్ లపై దాడి ప్రయత్నం చేసి V6 వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని చెన్నూరు పోలీసు స్టేషన్ లో జర్నలిస్టు యూనియన్లు, మీడియా ప్రతినిధులు పిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కవరెజీ చేస్తున్న V6 సిబ్బంది పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుల పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. బస్టాండ్ ఎదుట నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులు మీడియా ప్రతినిధుల పై దాడి చేస్తే ఊరుకునేది లేదని… పార్టీల వార్తలు, నాయకుల వార్తలు రాయకుండ పెన్ డౌన్ చేస్తామని జర్నలిస్టులు హెచ్చరించారు.