APCINEMATELANGANA

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు సమాంతరంగా తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే శంకర్ తన గేమ్ చేంజర్ కథను ముందుగా దిల్ రాజుకు వినిపించిన తరువాత.. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో అయితే బాగుంటుందని అన్నాడట. కానీ దిల్ రాజు మాత్రం పవన్ కళ్యాణ్‌ కంటే రామ్ చరణ్‌కి కథ బాగుంటుందని అన్నాడట.

శంకర్ మేనేజర్ ద్వారా ఈ కథ తన వద్దకు వచ్చిందట. ఓ కథ ఉందని వినమని దిల్ రాజుకు పంపించారట. కథ విన్నాక దిల్ రాజుకు బాగా నచ్చిందట. ఏ హీరో అనుకుంటున్నారని దిల్ రాజు అడిగితే.. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో అయితే బాగుంటుందని అన్నారట. అయితే ఈ కథ రామ్ చరణ్‌కు బాగా సూట్ అవుతుందని దిల్ రాజు చెప్పాడట.

ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో రామ్ చరణ్‌ బిజీగా ఉండగా.. ఓ సారి కలిసి శంకర్ చెప్పిన కథ గురించి చెప్పాడట. కరోనా టైంలోనే ఫోన్ ద్వారా కథను రామ్ చరణ్‌కు శంకర్‌ వినిపించాడట. కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్‌ కూడా ఓకే చెప్పేశాడట. అలా ప్రాజెక్ట్‌ను లాక్ చేసినట్టుగా దిల్ రాజు చెప్పాడు.

రామ్ చరణ్‌ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ రేంజ్‌లో పాటలు, సెట్టింగ్స్ కూడా వచ్చినట్టు అనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్‌గా మారిన చెర్రీకి ఈ ప్రాజెక్ట్ నిజంగానే గేమ్ చేంజర్ అయ్యేలా ఉంది. శంకర్, దిల్ రాజులకు కూడా రామ్ చరణ్‌ను తీసుకోవడంతో నేషనల్, ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మార్కెటింగ్‌కు ఈజీగా మారిపోయింది.

గేమ్ చేంజర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దించబోతోన్నట్టుగా దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ ఇప్పటి నుంచే హీటెక్కినట్టు అయింది. మహేష్‌ బాబు, రామ్ చరణ్‌ వంటి వారు సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.