APCINEMATELANGANA

షణ్ముఖ్‌తో మళ్లీ కలుస్తున్న దీప్తి సునైనా: నువ్వు సింగిలేనా అన్న నెటిజన్‌కు ఊహించని రిప్లై

అప్పట్లో అంటే టాలెంట్ ఉన్నా సరిగా అవకాశాలు దొరికేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది వెలుగులోకి వచ్చి తమ సత్తాను నిరూపించుకుంటోన్నారు.

తద్వారా చాలా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో క్యూట్ లేడీ దీప్తి సునైనా ఒకరు.

చాలా కాలం క్రితమే యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. షణ్ముఖ్‌ జస్మంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. అయితే, గత ఏడాదే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మధ్య దీప్తి.. షన్నూను మళ్లీ కలుస్తుందని టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఆమె ఏం క్లారిటీ ఇచ్చిందంటే!

ఆ వీడియోలతో పాపులారిటీ: దీప్తి సునైనా చాలా కాలం క్రితమే యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో డ్యాన్స్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేస్తూ అతి తక్కవ సమయంలోనే ఫేమస్ అయింది. అలాగే, షార్ట్ ఫిల్మ్‌లు కూడా చేస్తూ క్రేజ్‌ను ఏర్పరచుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో తెలుుగ రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు దీప్తి సునైనా క్రష్‌ అయిపోయింది.

బిగ్ బాస్ షోలో అతి చేసేసి: యూట్యూబర్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ ఓవర్ చేసింది. దీంతో దీప్తి సునైనాపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వెల్లువెత్తాయి.

షన్నూతో లవ్.. బ్రేకప్ చెప్పి: యూట్యూబ్‌లో వీడియోలు, సాంగ్స్ చేస్తోన్న సమయంలోనే దీప్తి సునైనా.. మరో యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్‌లో పడిపోయింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగించారు. ఫలితంగా వీళ్లు జంటగా ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది. దీంతో వీళ్ల ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ఏమోనే అంటూ.. ఎంజాయ్: కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా ఈ మధ్య కాలంలో దీప్తి సునైనా యూట్యూబ్‌లో వీడియోలు పెద్దగా అప్‌లోడ్ చేయట్లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని సాంగ్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బ్యూటీ ‘ఏమోనే’ అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. ఈ పాటకు అన్ని వర్గాల వాళ్ల నుంచి స్పందన వచ్చి హిట్ అయింది. ప్రస్తుతం దీప్తి పర్సనల్ ట్రిప్‌లతో రచ్చ రచ్చ చేస్తోంది.