APTELANGANA

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేలకోట్లు సమకూర్చుతా అని కేసీఆర్ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు.

భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని అన్నారు. హైటెక్‌ సిటీ వద్ద 15 ఎకరాల భూమిని తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు రాసిచ్చినట్టు ఆరోపించారు.

భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్‌ భూమిని కట్టబెట్టారని విమర్శించారు. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్‌ వందలాది కోట్లు ఖర్చుపెడ్డుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు ఎంత? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ విషయంపై దేశంలో ఉన్న అ‍న్ని రాజకీయల పార్టీలకు లేఖలు రాస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ భూదోపిడీపై సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు. కేసీఆర్ తో కాంగ్రెస్ కలువదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమైందన్నారు. కేసీఆర్ దగ్గర లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఉందని రేవంత్ ఆరోపించారు. హెటిరో పార్థసారథి కేసీఆర్ అనుచరుడని విమర్శించారు. ఆర్థిక నేరగాడు పార్థసారథిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు.

కేసీఆర్ భూదోపిడీపై సీబీఐ (CBI)కి లేఖ రాస్తానని ప్రకటించారు. కేసీఆర్ గజ దొంగ.. ఆయనతో కాంగ్రెస్ కలువదని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం కోసం.. కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్లు జర్నలిస్ట్ రాజ్దీప్ చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమైందని తప్పుబట్టారు.