పార్వతీపురం మన్యం జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఉన్న మీకు కనిపించడం లేదా అని అన్నారు. మీరు వాళ్లతో చేతులు కలిపి పార్టీని నడిపిస్తున్నారా అని ఆరోపించారు. ప్రధానమంత్రిని విమర్శించేవాళ్లు వాళ్ళు ధైర్యం ఉంటే స్థానిక ఎమ్మెల్యే పై మాట్లాడాలని తెలిపారు. బిజెపితో అభివృద్ధి జరుగుతుందని, పార్వతిపురం చుట్టూ 6 ఎక్స్ప్రెస్ హైవేలు వస్తున్నాయని అన్నారు. నోబుల్ శాంతి బహుమతికి నామినేటెడ్ కాబడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టానుసారం విమర్శించడం తగదని అన్నా