APTELANGANA

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి.

జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ ఎగ్జామ్ జరనగుంది. ఈ నెల 30 నుంచి జిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని ఐఐటీ గువాహటి వెల్లడించింది.

ప్రతి ఏడాది మెయిన్ ర్యాంకులు విడుదలైన తర్వాత రోజు నుంచే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అప్లికేషన్స్ సమర్పించే ప్రక్రియను మెుదలుపెడుతున్నారు. ఈనేపథ్యంలో ఈసారి ఈ నెల 29న జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ర్యాంకులు వెల్లడవుతాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో జరిగిన తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది అప్లై చేసుకుంటే.. వారిలో 8.24 లక్షల మంది హాజరయ్యారు. చివరి విడతకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 9 లక్షల మంది వరకు పరీక్ష రాసే అవకాశముందని తెలుస్తోంది.

8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. 8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం..?

2022 మెయిన్‌లో అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ స్కోర్‌ వివరాలు:
* ఎస్‌సీ: 43.0820954
* ఎస్‌టీ: 26.7771328
* ఓబీసీ: 67.0090297
* ఈడబ్ల్యూఎస్‌: 63.1114141
* జనరల్‌ (అన్‌ రిజర్వుడ్‌): 88.4121383