APCINEMATELANGANA

: 2 లక్షల పెట్టుబడి తో 10 లక్షల ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చదువుకున్న యువత ఎంత చదివినా ఫలితం లేదు అని జాబ్స్ కేవలం అదృష్టం డబ్బులు ఉన్నవాళ్లకే వస్తాయని చెప్పుకుంటూ ఏదైనా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వాళ్ళు కొన్ని బిజినెస్ (Business Idea) లు చేస్తూ జాబ్ చేసే వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మరికొంతమంది వాణిజ్య వ్యాపారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కొంతమంది రైతులుగా మారి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

ఇక అలా వ్యవసాయం చేయాలనే ఉద్దేశం ఉండి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించాలి అనుకునే వారికి ఇది ఒక శుభవార్త లాంటిది. ఈవాణిజ్య వ్యాపారం చేయడానికి రెండు లక్షలు పెట్టుబడి పెడితే చాలు పది లక్షల ఆదాయం వస్తుంది. మరి ఇంతకీ ఆ వాణిజ్య వ్యాపారం ఏంటో అని మీరు అనుకుంటున్నారా అది ఏదో కాదు అలోవెరా (Aloevera) సాగు చేయడం. అలోవెరాని చాలామంది కలబంద అంటారు. కలబంద సాగు ఎక్కువగా ఆసియా లేదా దక్షిణ ఐరోపా,ఆఫ్రికా పొడి ప్రాంతాలలో పెరుగుతుందని అంటారు.

అయితే ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర (Maharashtra) తో పాటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు.ఇక కలబందని ఎక్కువగా ఆయుర్వేదంలో చికిత్సలకు ఉపయోగిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక కలబంద పంట సాగు చేయడానికి తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం ఉంటుంది.అలాగే ఈ కలబంద (Aloevera) ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే శక్తి ఉంటుంది.అలాగే ఈ పంట సాగు చేయాలనుకునేవారు తక్కువ ఎరువులు వేసి అధిక దిగుబడి పొందొచ్చు.

ఒక హెక్టారుకు 10 నుంచి 15 టన్నుల పశువుల వ్యర్ధాలు వేయడం వల్ల ఈ పంటలో అధిక లాభం పొందవచ్చు. ఇక కలబంద పంటను సాగు చేసిన నాలుగో నెల నుంచే రైతులకు దిగుబడి రావడం మొదలవుతుంది. అలాగే సాగు చేసేటప్పుడు మొక్కల చుట్టూ అధిక నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక ఎకరం భూమిలో కలబంద (Aloevera) మొక్కలను అరవై వేల వరకు నాటుకోవచ్చు. అలాగే కలబంద సాగులో దాదాపు రెండు లక్షల పెట్టుబడి పెడితే 10 లక్షల ఆదాయం వస్తుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు ఎక్కువ వస్తుంది.