CINEMA

చిరంజీవి కూతురు సుస్మిత భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. అతడు ఏం చేస్తాడు?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి ముగ్గురు సంతానం అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుర్లు కాగా.. ఒక కుమారుడు. ఆల్రెడీ కుమారుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. తండ్రిని మించిన తనయుడుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్తతో విడిపోయి.. కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది.

అయితే ఇప్పుడు రెండో భర్తతో కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా తన ఇండ్రి నివాసంలోనే ఉంటూ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇకపోతే చిరంజీవి పెద్ద కూతురు పేరు సుస్మిత కొణిదెల(Sushmitha Konidala). ఈమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చిరంజీవికి వ్యక్తిగత స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించమే కాకుండా ఇటీవల ప్రొడక్షన్‌లోకి అడుగు పెట్టింది.

గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి నిర్మాతగా వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతున్నారు. సుస్మిత భర్త పేరు విష్ణు ప్రసాద్(Vishnu Prasad). విష్ణు ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అతుడు ఏం చేస్తాడు..? వంటి విషయాలు పెద్దగా ఎవరికీ తెలియదు.

విష్ణుప్రసాద్ ఫ్యామిలీతో రాయలసీమ అయినప్పటికీ చెన్నై(chennai) లో స్థిర పడ్డారు. చెన్నైలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బిజినెస్ మ్యాన్ ఎల్ వి రామారావుకు విష్ణు ప్రసాద్ మనవడు అవుతాడు. ఎల్ వి రామారావు కొడుకు ఎల్ వి ప్రసాద్. ఎల్ వి ప్రసాద్, చంద్రి దంపతులకు విష్ణు ప్రసాద్ జన్మించాడు. విదేశాల్లో విష్ణు ప్రసాద్ బిజినెస్ కి సంబంధించి మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం తన కుటుంబ వ్యాపారాలను విష్ణు ప్రసాద్ చూసుకుంటున్నాడు.