మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య షూటింగ్ ఇటీవల ఫ్రాన్స్ లో జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. చిరంజీవి అక్కడ నుండి ఒక వీడియోను రిలీజ్ చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించడంతో పాటు అక్కడి అందాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఫ్రాన్స్ నుండి మాట్లాడుతున్న, ఈనెల 12వ తేదీన శృతి హాసన్ తో సాంగ్ పూర్తయింది.
ఇక్కడ విజువల్స్ చాలా అద్భుతంగా ప్రత్యేకంగా అనిపించాయి. మేము షూటింగ్ చేసిన లొకేషన్స్ చాలా బాగున్నాయి. మైనస్ 8 డిగ్రీల చలిలో సాంగ్స్ చిత్రీకరణ కోసం స్టెప్స్ వేయడం అనేది చాలా కష్టం అనిపించింది. అయితే మీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను. ఈ విజువల్స్ మీకు చూపించాలని ఉద్దేశంతో నేనే స్వయంగా చిత్రీకరించాను. కచ్చితంగా ఈ పాట కూడా మిమ్ముల అలరిస్తుంది.
పాటతో పాటు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి అంటూ చిరంజీవి అక్కడి విజువల్స్ ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. అంతే కాకుండా వీడియో చివర్లో దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ సాంగ్ బిట్ ని లీక్ చేశాడు. నేను శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంటూ సాగే పాట త్వరలో విడుదల కాబోతున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నాడు. జనవరి 13వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇప్పటికే మైత్రి మూవీ మే