CINEMA

ఆదిపురుష్‌ సినిమా నుండి క్రేజీ అప్డేట్…

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మరో పాన్‌ ఇండియా సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమా ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అయితే.. ప్రభాస్ నటించిన ఈ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఈ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ కథానాయిక సీత పాత్రను పోషిస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా గురించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, తాజా విషయం ఏమిటంటే, మార్చి 30న వచ్చే రామనవమి సందర్భంగా మేకర్స్ ఒక అప్‌డేట్‌తో ముందుకు వస్తారని అభిమానులు భావిస్తున్నారు.

 

గతేడాది శ్రీరామనవమికి కూడా ఎలాంటి అప్డేట్‌ ఇవ్వని మేకర్స్‌.. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఈ శ్రీరామనవమికి మాంచి అప్డేట్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇస్తారని వేచిచూస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇందులో సన్నీ సింగ్ మరియు సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలు పోషించారు. T సిరీస్ మరియు రెట్రోఫిల్స్ సంయుక్తంగా ఈ పౌరాణిక చిత్రాన్ని 3D ఫార్మాట్‌లో విడుదల చేయాలని నిర్ధారించారు.