CINEMA

వామ్మో హీరో అంత రాక్షసుడా?

తమిళ స్టార్ హీరో సూర్య కంగువా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంటోంది. సూర్య లుక్స్, పాత్ర.. మొత్తంగా ఈ ప్రచార చిత్రం ఓ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

అయితే ఈ చిత్ర గ్లింప్స్ ను ఓ సారి తెలుగులోకి డీకోడ్ చేసి, సినిమా కథ ఎలా ఉండబోతుంది, ఆ టైటిల్ కు అర్థం ఏమిటి వంటి విషయాలను తెలుసుకుందాం…

రాజుగా సూర్య…:కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్బంగా.. ఆయన నటిస్తున్న సినిమా కంగువా ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మరీ ముఖ్యంగా సూర్య పాత్ర, లుక్స్ భయంకరంగా కనిపిస్తోంది. కమల్ హాసన్ విక్రమ్‌ సినిమాలోని రోలెక్స్ పాత్రకు మించి కిరాతకంగా ఉంటుందని అంటున్నారు. ఆటవిక జాతికి చెందిన నాయకుడిగా సూర్యను చూపించిన విధానం గూస్ బంప్స్ తెప్పించింది.

 

డీకోడ్ చేస్తే.. :ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటంగా ఈ గ్లింప్స్ ను చూపించారు. ఓ బలవంతుడైన ఆటవిక జాతికి చెందిన వ్యక్తి.. సూర్యకు సంబంధించిన వ్యక్తులను చంపుతుంటాడు. శవాలు గుట్టలుగా పడిఉంటాయి. అతడు ఎంత బలవంతుడు అంటే.. అతనితో పాటు ఓ నల్ల జాగ్వార్ కూడా ఉంటుంది. అలాంటి భయంకరమైన వ్యక్తిని నిప్పుల బల్లం విసిరి మరీ చంపుతాడు సూర్య.

కంగువా ఎవరు…:శవాల గుట్టల మీదుగా కొండపై కాగడాల వెలుగల మధ్య నిలబడిన సూర్యను.. కంగువగా పరిచయం చేస్తూ అద్భుతంగా చూపించారు మేకర్స్. సూర్యతో పాటు ఓ గుర్రాన్ని, పెద్ద రాబందును కూడా చూపించారు. అసలీ ఈ కంగువ ఎవరనేది చెప్పడానికి.. బ్యాక్ గ్రౌండ్ లో అఖిలాండం ఏలిన మారాక్రుని వంశకుడిగా చూపించారు. అంటే అతడు మారాక్రుని వంశకుడు అని అర్థం. ఆ వంశం జెండా నిలబెట్టేందుకు.. కొచ్చా మీల్ గా పిలుచుకున్న జాతి వారసత్వాన్ని అందుకుని వస్తాడు కంగువ. తంగయన్ కు మనవడు కంగువా. ఈ తంగయన్.. చెంచాగన్ అనే నరరూప రాక్షసుడిని.. చంపిన సెంథ మహా యోధుడి కుమారుడు.

 

కంగువ సామర్థ్యం…:కంగువ సామర్థ్యం ఏంటంటే.. అతడు అతి పెద్ద మందయార్ పర్వతాలను అధిరోహించాడు, పొడవైన చెట్లు ఎక్కగలడు, తెల్ల పులితో సైతం పోరాడాడు. మదమెక్కిన ఏనుగును వంచి దానిపై తిరిగేవాడట. వంద పులిగోరులు మెడలో వేసుకుని ఉంటాడు. ఆ పులిగోర్ల శబ్దానికి నేలపై పాకే విష సర్పాలు కూడా భయంతో ఎక్కడికక్కడ ఆగిపోతాయంట. అంతటి వీరుడు ధీరుడు కంగువ. మరి అతడు తన జాతిని కాపాడుకుని ఆధిపత్యాన్ని ఎలా సాధించాడనేదే ఈ కథ అని తెలుస్తోంది. అంచే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆటవిక జాతుల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరును.. అచ్చం కళ్లకు కట్టినట్టుగా ఈ చిత్రంలో చూపించనున్నారు.

 

కంగువ అర్థం.. :శివ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనుంది. కంగువ అంటే.. అగ్ని ధరించిన వ్యక్తి అని అర్థం. అలాగే పరాక్రమవంతుడు. అంటే ఈ సినిమాలో సూర్య అగ్నిని వెంటపెట్టుకుని యుద్ధాలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ కథ పురాణాలకు సంబంధించిన అసలైన కథ కాదని తెలిసింది. చరిత్రలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని,, దానికి కల్పిత కథను జోడించి తీస్తున్నారట. ఈ చిత్ర కథ మొత్తం 14వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందట. స్టూడియో గ్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. హీరోయిన్ గా దిశా పటానీ నటిస్తోంది. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయనున్నారు.