CINEMA

గేమ్ ఛేంజర్’.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీలో చరణ్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఆలస్యం పై ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చిత్రం రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. ‘2024 సెప్టెంబర్‌లో విడుదల కానుంది’ అని తెలిపాడు.