APCINEMATELANGANA

సమంత ఖాతాలో మరో ప్రెస్టీజియస్ బ్రాండ్

టామీ హిల్‌ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్‌ఫిగర్.

ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్‌ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. టామీ హిల్‌ఫిగర్ నుంచి రాబోతున్న విమెన్ కలెక్షన్ వాచ్ లలో ఈసారి వైవిధ్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్టైల్తో పాటు రోజువారీ జీవితంలో వాడేలా సింపుల్గానూ అలాగే స్పోర్టీగానూ వాచ్లను డిజైన్ చేశారు.