TELANGANA

విశాఖలో గర్భణీ అనుమానాస్పదస్థితిలో మృతి..

ర్త చనిపోయాడు.. ఉన్న ఒక్కగానొక కూతుర్ని అన్ని తానై చూసుకుంది. పెంచింది.. పెద్ద చేసింది. చదివించింది. అమ్మ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా అని అడిగింది.

కానీ.. ఆ అమ్మ.. బిడ్డకు పెళ్లి చేయాలనే అతృతలో పెళ్లైయక చదువుకోవచ్చు అంటూ సద్దిచెప్పింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చూసి పెళ్లి చేసింది. వివాహం అయిన నెల రోజులకే అసలు కథ మొదలైంది. భర్తతో పాటు అత్తమామలు ఆమెను వేధించారు. అయినా భరించింది. ఇంతలో ఆమె గర్భం దాల్చింది. ఇక భర్త ఉద్యోగ రీత్య వేరే చోటికి వెళ్లాడు. ఇంకేముంది అత్తమామల వేధింపులు మరింత పెరిగాయి.

ఏమైందో తెలియదు కానీ బుధవారం ఆ మహిళ బీచ్ శవమై తేలింది. వివస్త్రగా ఉన్న ఆ మహిళ మృతదేహాన్ని వైఎంసీఏ ఎదుట బీచ్‌లో మూడో పట్టణ పోలీసులు గుర్తించారు. మంగళవారం వేకువజామున మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతి చెందిన మహిళను శ్వేతగా గుర్తించారు. శ్వేత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో శ్వేత ఫోన్ కాల్ రికార్డింగ్స్ కీలకంగా మారాయి.

మరోవైపు అత్తమామ వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్వేత అత్తమామతో గొడవ పడి బయటకు వెళ్లింది. ఆమె ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు కాల్ రికార్డ్స్ బట్టి పోలీసులు గుర్తించారు. తన కూతుర్ని అత్తింటి వారే హత్య చేసి ఉంటారని రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని పోలీసులకు చెప్పారు. నెల రోజులు కింద కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని రమాదేవి తెలిపారు.

తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని చెప్పారు. అయనా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని ఆరోపించారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త బెదిరించేవాడని కన్నీరుమున్నీరయింది. తనకు భర్త లేడని.. ఉన్న కుమార్తెను కష్టపడి పెంచి.. పెద్ద చేశానని అన్నారు. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని శ్వేత రోజూ ఫోన్‌ చేసేదని రమాదేవి చెప్పారు. తన కూతురు ఏడవని రోజు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని చెప్పినా.. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారని తెలిపారు.