ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.
Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ మృతి చెందింది. అయితే కుటుంబసభ్యుల తెలియనితనం.. పోలీసుల కాలయాపన కారణంగా ఆమె మృతదేహం మూడు రోజులుగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే ఉన్నది. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
అత్తను చూపించేందుకు వచ్చింది
వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలోని చెన్నారావుపేట మండలంలోని ఓ తండాకు చెందిన ఓ మహిళ (45) తన భర్తతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం పాలైన వృద్ధురాలైన తన అత్తకు ఖమ్మంలోని మమతా ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఈ నెల 27న నెక్కొండ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌రైల్లో ఉదయం ఖమ్మం చేరుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో మమతా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు మరో ఆటోలో ఖమ్మం కొత్త బస్టాండ్‌కు బయలుదేరారు. దారిమధ్యలో అత్త.. తనకు మూత్రం వస్తుందనడంతో ఆటోడ్రైవర్ ఓ నిర్జన ప్రాంతంలో ఆటోను ఆపాడు. అత్త కిందకు దిగి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లగా.. ఆటోలోనే ఉన్న సదరు మహిళను ఆటోడ్రైవర్ అపహరించాడు. ఆ తర్వాత కోడలి కోసం పలుచోట్ల వెదికిన అత్త సాయంత్రానికి ఖమ్మం రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఇంటికి వెళ్లింది. మరుసటి రోజైన 28వతేదీ ఉదయం ఆ వృద్ధురాలు కుటుంబసభ్యులకు ఖమ్మంలో జరిగిన విషయం చెప్పడంతో వారు ఖమ్మం వచ్చి పలుచోట్ల గాలించారు.
ఖమ్మం ఆసుపత్రి
ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు