TELANGANA

మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్

 సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారు..?

ఎంత మందికి ఇళ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందన్నారు. అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం కోరితే పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కూకట్ పల్లి మూసాపేటలో బీజేపీ నేతలు చేస్తున్న ”ఆత్మగౌరవ దీక్ష”లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆత్మగౌరవ దీక్ష చేస్తున్న బీజేపీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు.

‘తెలంగాణ ప్రజలు నిలువ నీడ లేక జనం చచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్కడ గుడిసె వేసుకుని ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అల్లాడుతున్నారు. కూకట్‌పల్లికి వచ్చి ఎంతోమంది ఇక్కడే ఏండ్ల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేకపోతున్నారు. ఇట్లాంటి పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్లను నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కావాలని అడిగితే లక్షన్నర ఇండ్లు కావాలని కేసీఆర్ చెబితే.. మరో లక్ష ఇండ్లు అదనంగా మంజూరు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ ఇండ్లు పేదలు ఉండలేరు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని ఊరించి మోసం చేసిండు. కేసీఆర్ కొడుకు మాటలన్నీ కొంపలు ముంచేవే. అమెరికా పోయి చదివిన చదువు మోసం చేయడానికే తప్ప.. సంగారెడ్డిలో ఇయాళ ఆ కుటుంబం సంగతి చెబుతా..