TELANGANA

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ రోడ్డు వైపు శిల్పా లేవుట్‌ ఫేజ్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టనున్నారు.

దీంతో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) నారాయణ్‌ నాయక్‌ వెల్లించారు. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 10వ తేదీ వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. వాహనదారులు గమనించాలని కోరారు.

ఈ ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఇలా..

==> ORR వైపు నుంచి హఫీజ్‌పేటకు శిల్పా లేఅవుట్‌ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్‌, డెలాయిట్‌, ఏఐజీ ఆసుపత్రి, క్యూమార్ట్‌, కొత్తగూడపై బ్రిడ్జ్‌ మీదుగా వెళ్లాలి.

==> టెలికామ్‌ నగర్‌ నుంచి కొండాపూర్‌కు వచ్చే వాహనాలు గచ్చిబౌలి పై వంతెన కింద యూటర్న్‌ తీసుకోవాలి. అక్కడి నుంచి శిల్పాలేఅవుట్‌ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్‌, డెలాయిట్‌, AIG ఆసుపత్రి, క్యూ మార్ట్‌, కొత్తగూడ మార్గం గుండా రావాలి.

==> లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వైపునకు వచ్చే వాహనాలు గచ్చిబౌలి ట్రాఫిక్‌ PS నుంచి డీఎల్‌ఎఫ్‌, రాడిసన్‌ హోటల్‌, కొత్తగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

==> నానక్‌రాంగూడ విప్రో జంక్షన్‌ నుంచి ఆల్విన్‌ చౌరస్తా వైపునకు వెళ్లే వాహనాలు.. ట్రిపుల్‌ ఐటీ కూడలి వద్ద ఎడమ వైపు వెళ్లాలి. అక్కడి నుంచి గచ్చిబౌలి స్టేడియం ముందు యూటర్న్‌ తీసుకుని DLF, రాడిసన్‌ హోటల్‌ రోడ్డులో వెళ్లాలి.

==> టోలిచౌకి నుంచి ఆల్విన్‌ చౌరస్తాకు వచ్చే వాహనదారులు.. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు కూడలి నుంచి మైండ్‌స్పేస్‌, సైబర్‌ టవర్స్‌, కొత్తగూడ జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

==> ఆల్విన్‌ కాలనీ నుంచి లింగంపల్లికి వచ్చే వారు.. బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ మీదుగా మసీదు బండ, HCU RTC డిపో రోడ్డును అనుసరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.