TELANGANA

బంపర్ ఆఫర్.. రూ.2000 నోటు ఇస్తే రూ.2100 విలువైన వస్తువులు కొనొచ్చు.. !

గత శుక్రవారం ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పింది.

దీంతో చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఖర్చు పెడుతున్నారు. అయితే కొన్ని షాపుల్లో రూ.2000 నోట్లను తీసుకోవడం లేదు. కొంత మంది మాత్రం తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

ఢిల్లీలోని జీటీబీ నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.2000 నోటుకు సంబంధించి ఓ ఆఫర్‌ను ప్రకటించారు. రూ.2000 నోటుతో కొనుగోలు చేస్తే రూ.2100 విలువైన వస్తువులు ఇస్తునట్లు దుకాణం ముందు బోర్డు పెట్టారు. ఈ ఆఫర్‌కు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఆఫర్‌పై వ్యాఖ్యానిస్తూ, చాలా మంది వినియోగదారులు RBI తనను తాను తెలివైందిగా భావిస్తే, ఢిల్లీ ప్రజలు అంతకంటే తెలివైనవారని కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు దేశంలోని చాలా పెట్రోల్ పంపుల్లో 2000 రూపాయల నోటుతో ఇంధనం కొనుగోలు చేసేవారు పెరిగారు. ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను కూడా ఇక్కడే ఖర్చు చేస్తున్నారు. చాలా మంది పెట్రోల్ బంక్ యజమానులలు తమ వద్ద 2000 రూపాయల నోట్లకు చిల్లర ఇవ్వడానికి కి సరిపడా నగదు లేదని చెబుతున్నారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, సాధారణ రోజుల్లో 40 శాతం ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు ఇప్పుడు 10 శాతానికి తగ్గింది.