TELANGANA

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు:

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. మే 25న(గురువారం) ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(హైదరాబాద్)లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేస్తారు.

ఫలితాల పాస్‌వర్డ్ సీడీని 11.15 గంటలకు విడుదల చేయనున్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి హాజరుకానున్నారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఇక మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా మే 25నే వెల్లడించనున్నారు. ఎంసెట్ ఫలితాల కోసం
https://eamcet.tsche.ac.in/
అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.