AP

అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ వైఖరిపై చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టిడిపి శ్రేణులు ధర్నా చేపట్టారు.

ఈ ధర్నాలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ విద్యుత్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు.

ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు గుప్పించారు.

ఈ ధోరణి వల్లే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో సిబిఐ అధికారులు కఠిన వైఖరి అవలంబించడం లేదని చింతమనేని ప్రభాకర్ వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించిన చింతమనేని ప్రభాకర్ సిబిఐ అధికారులను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. వైయస్ వివేకా హత్య కేసులో నేరస్థుడిని సిబిఐ అధికారులు అరెస్టు చేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరు? హాట్ డిబేట్!!

ఇదిలా ఉంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన జస్టిస్ జె.కె మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ఎంపీ అవినాష్ రెడ్డికి కీలక సూచన చేసింది.