సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని దారుణంగా మోసం చేశాడు. అసలేం జరిగిందంటే..
ఒక వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా అతనితో పాటు పక్కన ఒక వృద్ధురాలు కూడా ఉంది. ఇక రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ వృద్ధురాలతో మాట మాట కలిపాడు. అనారోగ్యం గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఆమెకున్న జబ్బును నయం చేస్తాను అంటూ మాయ మాటలు చెప్పాడు. దాంతో ఆ వృద్ధురాలు ఆ నకిలీ డాక్టర్ మాటలు నిజమే అని నమ్మింది. రైలు దిగిన వెంటనే వృద్ధురాలికి చికిత్స చేస్తానంటూ మాయమాటలు చెప్పి ఒక లాడ్జికి తీసుకెళ్లాడు. లార్జీకి వెళ్ళిన తర్వాత కొన్ని మందులు ఇవ్వడంతో అవి వేసుకున్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.