చాలామంది డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే చాలు జీవితంలో సెటిల్ అయిపోతుందని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న వాళ్ళు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే జాబ్ కోసం నిరీక్షణ వేస్ట్ అని తాజాగా ఉన్న అనేక పనులు చెబుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేటు ఉద్యోగమైనా మనకంటూ స్వేచ్ఛ లేకుండా పని చేయాల్సి వస్తుంది. కానీ సొంతంగా పని చేసుకోగలిగిన టెక్నికల్ వర్క్స్ నేర్చుకుంటే అది మన భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. కాసుల వర్షం కురిపిస్తుంది. మనకు అనుకూలమైన సమయంలోనే పని చేసుకునే మంచి బిజినెస్ గా మారుతుంది.