ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన ఆయన..
బీజేపీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు.
ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూన్ 15న ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు భారీగా తరలివచ్చి బీజేపీ బలమెంటో ఇక్కడి కార్యకర్తలు చూపాలన్నారు బండి సంజయ్. అమిత్ షా మీటింగ్ సక్సెస్ అయితే కొత్తగూడెంకు ప్రధాని మోడీ వస్తారని చెప్పారు.