NationalTELANGANA

ఖమ్మంలో అమిత్ షాతో బీజేపీ బలప్రదర్శన అందుకేనా?

ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

పొంగులేటి బీజేపీలో చేరక పోవడం వెనక స్థానికంగా బీజేపీకి బలం లేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఖమ్మంలో బీజేపీ తన సత్తా చాటాలని, బలప్రదర్శనకు రెడీ అయింది.

ఖమ్మం వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తో బహిరంగ సభను నిర్వహించి ఖమ్మంలో కమలం పార్టీ తన బలాన్ని నిరూపించుకోబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పార్టీలో జోష్ నింపటానికి, పార్టీని బలోపేతం చేయడానికి, బిజెపి అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ చేస్తుంది అని చెప్పడానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.