TELANGANA

తాసిల్దార్ కార్యాలయం ఎదుట కుల వృత్తుల వారు ధర్నా కుల. ఆదాయ. నివాస ధ్రువపత్రాల జాప్యం పై నిరసన

 

అల్లాదుర్గం. తెలంగాణ ప్రభుత్వం బిసి కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే పథకంపై సర్టిఫికెట్ల జారీ లో జాప్యంపై లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీరికి అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం మంచి ఉద్దేశమైనా. ధ్రువపత్రాలు అందించడంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది. జాప్యం వల్ల దరఖాస్తుదారులు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అందక నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సిబ్బంది ప్రశ్నిస్తే సర్వర్ డౌనని చెబుతున్నారని వందల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అన్యాయం జరుగుతుందని. సర్వర్ ప్రాబ్లం లేకుండా ధ్రువపత్రాలు సకాలంలో అందించి వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని పొడిగించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.