TELANGANA

తెలంగాణకు నైరుతి రుతుపవనాల చల్లని సంకేతాలు: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లటి సంకేతాలిచ్చాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది.