APTELANGANA

నక్కతోకను తొక్కిన హీరోయిన్ శ్రీలీల

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు. శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటివారంలో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా సుదీర్ఘ విరామం తర్వాత పట్టాలెక్కడం గమనార్హం.

మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికో రూపొందుతోన్న మూడో సినిమా ఇది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్ లో ప్రాజెక్ట్‌ కుదిరినప్పటికీ షూటింగ్ కోసం మాత్రం పలు అవాంతరాలు ఎదురయ్యాయి. కొన్ని నెలల విరామం తర్వాత సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం కావడంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల పేర్లని గతంలో ప్రకటించారు. ఈమధ్యే గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే తప్పుకుంది. ఆ స్థానంలో మరొక కథానాయిక ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీల ప్రధాన కథానాయికగా మారింది. మరో పాత్రకు సంబంధించి మీనాక్షి చౌదరి ఖాయమైందంటున్నారు.

మహేష్ బాబుకు గుంటూరు కారం 28వ సినిమా కాగా, 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు. వచ్చే ఏడాది అది పట్టాలకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్ డేట్ ను రచయిత విజయేంద్రప్రసాద్ అందించారు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ పూర్తిచేసి జులై లోపే రాజమౌళికి అందజేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా క్లైమాక్స్ ను బట్టి దీనికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే ఆస్కారం ఉందన్నారు. సాహసాలతో కూడిన ఓ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది.