TELANGANA

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (Indo Tibetan Border Police ITBP) ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 27వ తేదీ నుంచి ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం 458 పోస్ట్ (డ్రైవర్) లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఆన్ లైన్ లో అప్లికేషన్

ఈ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. మొత్తం 458 పోస్ట్ (డ్రైవర్) లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 26. అలాగే, ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వారి వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వారికి హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

అప్లై చేసుకోవడం ఎలా?

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ముందుగా, ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ను ఓపెన్ చేయాలి.
హోం పేజీపై కనిపించే new user registration లింక్ పై క్లిక్ చేయాలి.
వివరాలు ఫిల్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో ఇచ్చిన వివరాలతో మరోసారి లాగిన్ కావాలి.
అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
సబ్మిట్ బటన్ నొక్కాలి. దాంతో, మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ పూర్తవుతుంది.
అప్లికేషన్ ఫామ్ ను, కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.