హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు రయీస్ ఉద్దీన్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఉద్దీన్ వద్ద ఉన్న నగదు, నగలును దోచుకెళ్లారు.
మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ 2011 లో మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అక్టోబర్ 5న కూతురు పెళ్లి ఉండటంతో హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు. రయీస్ ను ఉగాండాకు చెందిన వ్యక్తి తో అఫ్గాని వ్యక్తి పొడిచి చంపినట్లు పోలీసులు భావిస్తన్నారు. డబ్బుల కోసం గొడవ పడి కత్తితో పొడిచి పరారైనట్లు భావిస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రయీస్ ఉద్దీన్ ను అసలు ఎందుకు హత్య చేశారనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. రయీస్ హత్య కుటుంబ సభ్యులకు తెలియండతో విషాదంలో మునిగిపోయారు.
రయీస్ ఉద్దీన్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక నేత అంజదుల్లా ఖాన్ రైసుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉపాధి కోసం లండన్ వచ్చిన హైదరాబాద్ వాసి మహమ్మద్ ఖాజా రైసుద్దీన్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రైసుద్దీన్తో పాటు ఆఫ్ఘాన్ దేశస్థుడుతో కలిసి వెళ్తుండగా వారిద్దరిపై దాడిచేసి హతమార్చారు.
శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడినట్లు తెలిసింది.రయీస్ ఉద్దీన్ ఘటన స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొద్ది రోజుల క్రితం లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువతి జూన్ 13న వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌లోని తన నివాసంలో హత్యకు గురైంది. మృతురాలు కొంతం తేజస్విని రెడ్డి, హైదరాబాద్ లోని చంపాపేటుకు చెందినదిగా గుర్తించారు. ఆమె యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్‌హామ్‌లో చదువుతోంది. ఆమెను ఇద్దరు పొడిచ హత్య చేశారు. వారద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.