TELANGANA

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్స్.. బెనిఫిట్స్ మాములుగా లేవుగా..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. ఇప్పటివరకు అందించిన ఫీచర్స్ జనాలను ఆకట్టుకున్నాయి..తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది..వాట్సాప్ బిజినెస్ ఇండికేటర్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది..యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి మెటా సర్వీసెస్‌లను కొన్ని బిజినెస్ యజమానులు ఉపయోగిస్తారు.

ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని వాట్సాప్ బీటా లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.. టెస్టర్లకు ఈ ఫీచర్ పని చేస్తుంది.. ఇక ఆండ్రాయిడ్ యాప్ ఫ్యూచర్‌ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.. ఈ ఇండికేటర్స్ వల్ల ప్రైవసీ దెబ్బతింటుందని చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న, మధ్యస్థ వ్యాపారాలతో మెసేజ్‌లు ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి.. యుజర్, బిజినెస్ లు మాత్రమే ఇందులో ఉంటాయి..

అయితే క్లౌడ్ ప్రొవైడర్లతో సాగే వ్యాపారాలతో మెసేజ్‌లు ఇప్పటికీ మెటా లేదా ఎక్స్‌టర్నల్ కంపెనీల నుంచి సురక్షితమైన సర్వీస్ ద్వారా ప్రొటెక్షన్ పొందుతాయి. ఈ ఇండికేటర్స్ స్నేహితులు, కుటుంబ సభ్యుల పర్సనల్ చాట్స్‌ను లేదా వాట్సాప్ ప్రైవసీ విధానాన్ని ప్రభావితం చేయవు..బ్లాక్ చేసే ఆప్షన్ కొన్ని వ్యాపారాలతో చాట్ చేస్తున్నప్పుడు మెటాతో ఏదైనా సమాచారాన్ని పంచుకోవడం సౌకర్యంగా లేకుంటే, ఎప్పుడైనా వాటిని ఎప్పుడైనా నివేదించవచ్చు లేదా బ్లాక్ చేయవచ్చు. అధికారిక వాట్సాప్ వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా వ్యాపారాలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాట్సాప్ ప్రైవసీని ఎలా సెక్యూర్ చేస్తుందో మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు..