TELANGANA

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 దశాబ్దల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లు చెక్కు చెదరలేదు అని ఆయన ఆరోపించారు.

కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే రాష్ట్రంలో మొదట గెలిచే స్థానం కామారెడ్డినే అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడగొట్టే మొగొడు రేవంత్ రెడ్డే అంటూ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానన్న రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకుంటున్నాను రేవంత్ రెడ్డి మొండోడు, ధైర్యవంతుడు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి చైనా లాంటి దేశంలో జరుగుతే దాని బాధ్యులను ఉరి తీసేవారు అని ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపంపై న్యాయ విచారణ జరిపి, జ్యూడిషన్ ఎంక్వయిరీ చేయించి బాధ్యలును కటకటాల్లోకి పంపిస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తిన్న కమిషన్లన్నీ కక్కిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్-బీజేపీ అంతర్గత ఒప్పందం ప్రజలకు తెలిసిపోయింది.. అందుకే కాంగ్రెస్ పార్టీపై ఆ రెండు పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.