TELANGANA

అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసీఆర్..

లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు.

నేల తల్లి నుదిటిన తిలకం పెట్టిన యువతది ఈ కోరుట్ల ప్రాంతం.. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం నా పూర్వజన్మ సుకృతం.. కోరుట్ల నియోజకవర్గం రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది అని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. కోరుట్లలో బీజేపీ గెలుపు తెలంగాణ రాజకీయాలకు ఆదర్శంగా నిలవబోతుందని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.

 

ఈ కోరుట్ల నియోజకవర్గంలో డబ్బులు పంచకుండా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ పేర్కొన్నారు. అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసిఆర్.. ఈవీఎంలలో రోడ్డు రోలర్, కారు గుర్తులను గుర్తించేందుకే కంటి వెలుగు తీసుకువచ్చాడు సీఎం కేసిఆర్ అని ఆయన చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.