TELANGANA

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల జాబితా సిద్దం – రేవంత్ ఛాయిస్, లిస్టులో..!!

తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో..ఇప్పుడు లోక్ సభ సీట్ల పైన గురి పెట్టింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరనున్నాయి. ముందుగానే అభ్యర్దుల ను ఖరారు చేసి ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది. మెజార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది.

 

లోక్ సభ అభ్యర్దుల ఎంపిక: ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ కు భారీ టాస్క్ అప్పగించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. అందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అభ్యర్దుల ఖరారులో రేవంత్ సూచనలకు ప్రాధాన్యత దక్కనుంది. అభ్యర్దులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. నల్గొండ లోక్ సభ నుంచి జానారెడ్డి లేదా పటేల్ రమేశ్ రెడ్డి కి ఛాన్స్ దక్కనుంది.

 

భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మ లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి లేదా సీతా దయాకర్ రెడ్డిలలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరు వినిపిస్తోందది. చేవెళ్ల నుంచి కేఎల్ఆర్ లేదా కొత్తగా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతకు ఛాన్స్ ఉంది.

 

త్వరలో ఖరారు: మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావును బరిలోకి దింపుతారని తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ, ఖమ్మం నుంచి రేణుకా చౌదరి లేదా పోట్ల నాగేశ్వరరావు పేర్లు రేసులో ఉన్నాయి. మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్ లేదా విజయాబాయ్ లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య లేదా మంత్రి పదవి ఇవ్వకపోతే అద్దంకి దయాకర్, దొమ్మాట సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

 

మెదక్ నుంచి విజయశాంతిని బరిలో దింపుతారని సమాచారం. హైదరాబాద్ నుంచి అజాహరుద్దీన్ లేదా ఫిరోఖ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ / నవీన్ యాదవ్ పేర్లు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్/ జీవన్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది.

 

పార్టీ ఆమోదంతో: కరీంగనర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి/ రోహిత్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదిలాబాద్ నుంచి నరేశ్ జాదవ్ పేరు పరిశీలించే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి తిరిగి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అయితే, ప్రత్యామ్నాయం లేని నియోజవర్గాలు…ఖచ్చింగా గెలిచే అవకాశం ఉంటే మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు.

 

తెలంగాణలో ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ సైతం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో..సీట్ల ఎంపిక సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అభ్యర్దులను ప్రచారంలోకి పంపాలనే ఆలోచన సాగుతోంది. అధికారికంగా ప్రకటన ఆలస్యం అయినా..ముందుగానే అభ్యర్దులకు సమాచారం ఇచ్చి ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.