సరిగ్గా మూడు రోజుల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో బట్టబయలు చేసిన 22 కార్ల కహాని రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. మొదట్లో ఈ కార్ల గురించి ఎదురుదాడికి దిగిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఆ తర్వాత రోజుకో రకంగా మాట మార్చారు. కార్లు కొనుగోలు చేయలేదని కొంతమంది, కార్లు కొనుగోలు చేస్తే తప్పేంటని, కార్ల కొనుగోలు బాధ్యత ఇంటలిజెన్స్ చూసుకుంటుందని.. ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఏడాది క్రితం కొన్న కార్ల కోసం ప్రభుత్వం దాదాపుగా 66 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఒక్కో కార్ మీద మూడు కోట్ల వరకు వెచ్చించింది. మరి ఈ స్థాయిలో ఖర్చుపెట్టినప్పుడు అవి విజయవాడలోనే ఇంకా ఎందుకు ఉన్నాయి? వాటిని తెలంగాణకు తీసుకురావడంలో ఎందుకు జాప్యం ఏర్పడుతోంది? అసలు ఇప్పటివరకు ఎన్ని కార్లు తెలంగాణకు వచ్చాయి?
More
From Telangana politics
మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని భావించిన కేసీఆర్ సరిగా ఏడాది క్రితం 22 వాహనాలను బుక్ చేశారు. అవన్నీ కూడా ల్యాండ్ క్రూయిజ్ బ్రాండ్ కు సంబంధించినవి. వీటిని టయోటా కంపెనీ ఎప్పటినుంచో తయారు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో 18 ఫార్చునర్ 18 ఫార్చునర్ కార్లను కెసిఆర్ కాన్వాయ్ కోసం కొనుగోలు చేశారు. ఆ బండ్లు మంచి స్టాండర్డ్స్ తో ఉన్నప్పటికీ కొత్తగా 22 కార్లను కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కొనుగోలు చేసిన వాహనాలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉండటం విశేషం. అయితే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ 22 కార్లు ఇప్పుడిప్పుడే తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆ 22 వాహనాలలో కేవలం నాలుగింటికి మాత్రమే బుల్లెట్ ప్రూఫ్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇతర సాంకేతిక వ్యవస్థ అనుసంధానం జరిగిందని తెలుస్తోంది.. ఇక వాటిలో మూడు కార్లు మాత్రమే సీఎంఓ కి డెలివరీ అయ్యాయి. ఒక కారు టెస్టింగ్ కోసం కేరళ తరలించారు. అయితే మిగతా 18 కార్లు మాత్రం వీర పనిని గూడెం లోని త్రీ హాయని ఇంజనీరింగ్ వర్క్స్ లోనే ఉన్నాయని తెలుస్తోంది.. ఇక ఆ 18 కార్లలో 9కార్లకు మాత్రమే ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్, ఇతర సాంకేతిక పనులు జరుగుతున్నాయి. ఈ తొమ్మిది కార్లను మాత్రమే పూర్తిగా డోర్లతో సహా విడదీసి పక్కన పెట్టారు. బానెట్లను కూడా పూర్తిగా తొలగించారు. కార్ల స్ట్రక్చర్ మాత్రమే కొంతమేర కనిపిస్తున్నాయి. ఇక త్రీ హాయ్ అని ఇంజనీరింగ్ వర్క్స్ లో పనిచేస్తున్న నిపుణులు మొత్తం కేరళ రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం.
తెలంగాణ ముఖ్యమంత్రి ఆ 22 కార్ల గురించి వ్యాఖ్యలు చేసిన అనంతరం త్రిహాయని ఇంజనీరింగ్ వర్క్స్ లోకి జనం పోటెత్తుతున్నారు.. దీంతో అక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గంగా ఆ కంపెనీ 25 సీసీ కెమెరాలతో నిరంతరంగా నిఘా కొనసాగిస్తోంది. అంతేకాదు తమ సిబ్బందిని సెల్ ఫోన్లు కూడా లోపలికి తీసుకు వెళ్ళనివ్వడం లేదు. ఇక గత ఏడాది 22 వాహనాలను అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ కంపెనీకి బుల్లెట్ ప్రూఫ్ గా మార్చే పని అప్పగించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత రోజు పది మంది నిపుణులు పనిచేసేవారు. తర్వాత కాలానికి ఆ సంఖ్య ఐదుగురికి తగ్గిపోయింది. రేవంత్ రెడ్డి ఇటీవల ఆ కార్ల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో పనులు కొంతమేర ఊపు అందుకున్నాయి.. అయితే ఇప్పుడంతలో కార్లు డెలివరీ సూచనలు కన్పించడం లేదు.