4 H Dతెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పోలీస్ లు విస్తృత తనిఖీలు చెప్పాట్టారు. చెన్నూర్ రూరల్ CI విద్యాసాగర్, కోటపల్లి SI వెంకట్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రాణహిత నది సరిహద్దులుగా గ్రామాలైన వెంచపల్లి, జనగామ, ఆలుగామ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి సరిహద్దు భద్రత పై గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ప్రాణహిత నదిలో చేపలు పట్టేవారు, నదిలో పడవలు నడిపేవారితో మాట్లాడారు. అనుమానాస్పద వ్యక్తులు సరిహద్దుల్లో సంచరిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఎవ్వరు కూడా ఆశ్రమం కల్పించకూడదని, సరిహద్దు భద్రత కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ లకు సమాచారం చేరవేయలన్నారు. మహారాష్ట్ర నుండి తెలంగాణకు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారి కదలికలలో ఎలాంటి అనుమానం కలిగిన పోలీస్ లకు తెలపాలని పడవలు నడిపే వారికి CI, SI లు సూచించారు. పడవల ద్వారా సరిహద్దులను తెలంగాణ లోకి వస్తున్నవారిని ప్రతిఒక్కరిని పోలీస్ లు తనిఖీ చేసి వారి వివరాలను సేకరించారు.
అలాగే సరిహద్దు గ్రామాల్లోని యువత అప్రమత్తంగా ఉంటూ పోలీస్ లతో కలసి ముందుకు సాగాలన్నారు. సరిహద్దులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమకు తెలియజేయలని CI SI వెంకట్ సూచించారు.