TELANGANA

వైసీపీ నాలుగో జాబితా విడుదల..

సుదీర్ఘ కసరత్తు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను ప్రకటించింది. తొమ్మిది మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

 

అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే:

 

జీడీ నెల్లూరు (ఎస్సీ): ఎన్ రెడ్డప్ప శింగనమల (ఎస్సీ): ఎం. వీరాంజనేయులు తిరువూరు (ఎస్సీ): నల్లగట్ల స్వామిదాసు కొవ్వూరు (ఎస్సీ): తలారి వెంకట్రావు నందికొట్కూరు (ఎస్సీ)ం సుధీర్ ధార

గోపాలపురం (ఎస్సీ): తానేటి వనతి (హోంమంత్రి) చిత్తూరు పార్లమెంట్ (ఎస్సీ): కె నారాయణస్వామి మడకశిర(ఎస్సీ): ఈర లక్కప్ప కనిగిరి: దద్దాల నారాయణయాదవ్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ముందుంది. ఇప్పటికే సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మరోవైపు, ప్రతిపక్షాలను ఎండగడుతూ వైసీపీ అధినే, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రులు, వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు.

 

ఇక, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించేందుకు సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో కలిసి వెళ్లాలా? లేదా? అనేదానిపై ఈ రెండు పార్టీలు స్పష్టమైన నిర్ణయానికి రావడం లేదు. బీజేపీ కూడా జనసేనతో పొత్తు కొనసాగుతోందని చెబుతున్నప్పటికీ.. టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అభ్యర్థులను ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.