TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని పీర్జాదిగూడకు చెందిన రాధిక.. పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేరశారు.

 

జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో లే అవుట్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక్కడి 160 మంది ప్లాట్ యజమానులను ఆయన ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్లాట్లు తాను చెప్పిన ధరకు తనకే ఇవ్వాలని లేదంటే ఈ ప్లాట్లు దక్కనీయనని పల్లా హెచ్చరించినట్లుగా ఆరోపణలున్నాయి.

 

ఈ క్రమంలోనే తమ ప్లాట్లను ఆక్రమించారంటూ రాధిక అనే బాధితురాలు పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఏ1గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2గా ఆయన భార్య నీలిమా చౌదరి, ఏ3గా మధుకర్ రెడ్డి అనే వ్యక్తిని చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. 38ఈ హోల్డర్స్ రిజిస్ట్రేషన్స్ చేసి కబ్జాకు యత్నించారని ఫిర్యాదులో బాధిరాలు పేర్కొన్నారు. పల్లా కుటుంబం 200 మందిని ఇబ్బంది పెడుతోందన్నారు.

 

అనురాగ్ ఆస్పత్రి నిర్మాణం పేరుతో పల్లా ఫ్యామిలీ ఆ భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ, రెవెన్యూ, కోర్టులను తప్పుదారి పట్టించినట్లు పల్లాపై ఆరోపణలు వినిపిస్తున్నాయి