TELANGANA

మహిళలకు నెలకు రూ.2500.. ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

 

అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ లిసిండర్ అందిస్తోంది. దీని ద్వారా లక్షల్లో లబ్ధి పొందుతున్నారు. మీరు లిసిండర్ బుక్ చేసి రూ.900 చెల్లిస్తే సిలండర్ వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.400 జమ చేస్తోంది. దీంతో లబ్ధిదారులకు రూ.500 గ్యాస్ సిలిండర్ లభించినట్లు అవుతుంది. అలాగే ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు.

 

200 యూనిట్ల లోపు ఉన్నవారికి విద్యుత్ బిల్లు మాఫీ చేస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వమే చెల్లించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీ కూడా అమలు చేయాల్సి ఉంది. అదే కుటుంబ మహిళ పెద్దకు రూ.2500 చెల్లించాలి. ఎన్నికలకు ముందు మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తోంది.

 

మహిళలకు రూ.2500 పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల తర్వాతే మహిళలకు నెలకు రూ.2500 అందించే పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు పొందాలంటే.. రేషన్ కార్డు అవసరం. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు. అయితే రాష్ట్రంలో చాలా మంది కొత్ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.