తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు.