TELANGANA

అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

అందరు గర్వించేలా, అందరు హర్షించేలా, ప్రతి మనిషికి భరోసా కల్పించేలా సామాన్య ప్రజల నుండి సంపన్నుల ప్రజల దాక అందరికి సమాన హక్కులను కలిపించే విధంగా
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శ్రమించి 2 సంవత్సరాల 11నెలల 18రోజులు కాలాన్ని తీసుకొని భారతదేశం యొక్క విలువలను గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజునే నేషనల్ లా డే అని కూడా అంటారు ఈ సందర్బంగా…

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు అంబేద్కర్ సంఘం నాయకులు.. అనంతరం భారత రాజ్యాంగ విలువలు కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు..