TELANGANA

ఉద్యోగాల భర్తీ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణ నుంచి అధిక సంఖ్య సివిల్స్ లో రాణించే లా ప్రభుత్వ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాది లోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. గ్రూపు -1 నియామకాల భర్తీ గడువు పైనా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ సివిల్స్ సర్వీసు అభ్యర్ధులకు అభయం ఇచ్చారు. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్ధులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను సీఎం పంపిణీ చేసారు. 20 మంది అభ్యర్ధులకు ఒక్కొక్కరికి రూ లక్ష చొప్పున చెక్కులను అందిం చారు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే జరిగిందని గుర్తు చేసారు. గత పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీ లేని కారణంగా నిరుద్యోగులు నష్టపోయారని వివరించారు. తమ హయాం లో అలాంటి పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

 

సివిల్స్ లో బీహార్ నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్ధులు రాణిస్తున్నారని రేవంత్ విశ్లేషించారు. తెలంగాణ నుంచి ఈ సంఖ్య పెరగాలని.. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని చెప్పుకొచ్చారు. సివిల్స్ అభ్యర్ధులకు అందిస్తున్నది ఆర్దిక సాయమే కాదని.. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహంగా భావించాలని సూచించారు. కష్టంతో పాటుగా కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని రేవంత్ పేర్కొన్నారు. 14 ఏళ్ల కాలంగా గ్రూపు -1 పరీక్ష నిర్వహించలేదని రేవంత్ వివరించారు. తాము అడ్డంకులను అధిగమించి గ్రూప్ -1 ఉద్యోగాల పరీక్షలు నిర్వహించి న విషయాన్ని వివరించారు.

 

మార్చి 31 లోగా ఈ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభు త్వం జాబ్ కాలెండర్ మేరకు ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. సివిల్స్ కు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చా రు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్ లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.