APTELANGANA

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు జరిగాయి. సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జై భీమ్.. జై భీమ్ అంటే నినాదాలు చేశారు. అంబేద్కర్ బాట అనుసరణీయమని, అతని అడుగుజాడల్లో యువత నడవాలని ఆయన పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.